unani: కేన్సర్‌కు గోమూత్రంతో ఔషధాలు: కేంద్ర సహాయమంత్రి అశ్వినీకుమార్

షార్ట్స్‌లో చూడండి
కేన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధులకు గోమూత్రంతో ఔషధాలు తయారుచేయవచ్చని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అశ్వనీకుమార్‌ చౌబే పేర్కొన్నారు. గోమూత్రంతో వివిధ రకాల ఔషధాలు తయారుకానున్నాయని, ఆయుర్వేద, యోగ అండ్ నేచురోపతి, యునానీ, సిద్ధ అండ్ హోమియోపతి(ఆయుష్) మంత్రిత్వశాఖ వీటిని తయారుచేయబోతోందని మంత్రి తెలిపారు.

తమిళనాడులోని కోయంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆయుష్మాన్ భారత్ పథకంలో కేన్సర్ చికిత్సను కూడా చేర్చేందుకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ యోచిస్తున్నదని మంత్రి పేర్కొన్నారు.
Go Back to Shorts
unani
health
cow
mediciines

More Telugu News