Pakistan: భారత్‌ను అనుసరించనున్న పాక్.. ట్రిపుల్ తలాక్‌పై నిషేధం?

  • భారత్‌లో ఇప్పటికే అమల్లో ఉన్న చట్టం
  • పాక్‌లోనూ అమలు చేయాలంటూ సీఐఐ ప్రతిపాదన
  • పరిశీలిస్తున్న ప్రభుత్వం

ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తెచ్చి ముస్లిం మహిళలకు భారత ప్రభుత్వం అండగా నిలిచినట్టుగానే పాక్ కూడా ట్రిపుల్ తలాక్ చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మూడుసార్లు తలాక్ చెప్పి భార్య నుంచి తక్షణం భర్త విడాకులు పొందడాన్ని నేరంగా పరిగణించాలని ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ప్రభుత్వానికి న్యాయపరమైన సలహాలు అందించే పాకిస్థాన్ కౌన్సిల్ ఆఫ్ ఇస్లామిక్ ఐడియాలజీ (సీఐఐ) ట్రిపుల్ తలాక్ దురాచారాన్ని రద్దు చేయాలంటూ ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. కాగా, భారత్‌లో ఇటీవలే ట్రిపుల్ తలాక్ చట్టం అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే.

More Telugu News