Telangana: రైతులు అందరికీ సరిపడా యూరియా అందించాలి: సీఎం కేసీఆర్ ఆదేశాలు

  • తెలంగాణలో యూరియా కొరతపై చర్యలకు ఆదేశాలు
  • మూడు, నాలుగు రోజుల్లో యూరియా సరఫరా చేయాలి
  • కేంద్రం నుంచి ఏపీలోని ఓడరేవులకు చేరిన 15 వేల టన్నుల యూరియా

తెలంగాణలో యూరియా కొరతపై తెలంగాణ సీఎం కేసీఆర్ చర్యలకు ఆదేశించారు. రైతులు అందరికీ సరిపడా యూరియా అందించాలని, మూడు, నాలుగు రోజుల్లో యూరియా సరఫరా చేయాలని ఆదేశించారు. కేంద్రం నుంచి ఏపీలోని ఓడరేవులకు 15 వేల టన్నుల యూరియా చేరిందని, అక్కడి నుంచి తెలంగాణలోని గ్రామాలకు నేరుగా వీటిని తరలించడానికి వ్యవసాయ అధికారులను పంపాలని ఆదేశించారు.

ఈ ఆదేశాల మేరకు మంత్రులు రంగంలోకి దిగారు. యూరియా కంపెనీల ప్రతినిధులను ప్రగతి భవన్ కు మంత్రులు పిలిపించారు. కాగా, యూరియా బస్తాల తరలింపునకు గాను 25 గూడ్స్ రైళ్లు కేటాయించాలని రైల్వే అధికారులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తికి రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారు. రైళ్లలోనే కాకుండా నాలుగు వేల లారీల ద్వారా కూడా యూరియా బస్తాలను తీసుకురానున్నారు.

More Telugu News