Ravindra Naik: తెలంగాణ నిజమైన బిడ్డలు కేసీఆర్ నాయకత్వంలో పని చేయలేరు: రవీంద్ర నాయక్

  • రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించుకోవాలి
  • కేసీఆర్ ను ఎదుర్కోవడానికే బీజేపీలో చేరాను
  • బీజేపీ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తాం
రాష్ట్రానికి పట్టిన గులాబీ చీడను వదిలించుకోవాలని బీజేపీ నేత రవీంద్ర నాయక్ పిలుపునిచ్చారు. నిజమైన తెలంగాణ బిడ్డలు కేసీఆర్ నాయకత్వంలో పని చేయలేరని చెప్పారు. ఈటల రాజేందర్, రసమయిల వ్యాఖ్యలు దీనికి నిదర్శనమని అన్నారు. కేసీఆర్ ను ఎదుర్కొనే నాయకత్వం కాంగ్రెస్ పార్టీలో లేనందువల్లే తాను బీజేపీలో చేరానని తెలిపారు. లంబాడీ భాషను 8వ షెడ్యూల్ లో చేర్చడం, తండా డెవలప్ కార్పొరేషన్, గిరిజన్ ఆశ్రమ పాఠశాల ఏర్పాటుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా సుముఖత వ్యక్తం చేశారని చెప్పారు. బీజేపీ శ్రేణుల ఆధ్వర్యంలో రేపు ప్రభుత్వ ఆసుపత్రులను పరిశీలిస్తామని తెలిపారు.
Ravindra Naik
BJP
KCR
TRS
Amit Shah

More Telugu News