ఒక్క క్షణం కూడా పనిచేయలేను.. పదవికి మరో ఐఏఎస్ అధికారి రాజీనామా!
- కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో ఘటన
- డిప్యూటీ కమిషనర్ గా పనిచేస్తున్న సెంథిల్
- ప్రజల్ని క్షమాపణలు కోరిన డిప్యూటీ కమిషనర్
ఈ విషయమై ఆయన స్పందిస్తూ..‘ప్రజాస్వామ్య ప్రాథమిక పునాదులు అసాధారణ రీతిలో దెబ్బతిన్న వేళ ఓ ఐఏఎస్ అధికారిగా ప్రభుత్వంలో కొనసాగడం అనైతికమని భావిస్తున్నాను. నా రాజీనామాతో ఏ వ్యక్తికీ ఎలాంటి సంబంధం లేదు. రాబోయే రోజుల్లో మన దేశపు సమాజంలోని మౌలిక స్వరూపానికి తీవ్రమైన సవాళ్లు ఎదురు కాబోతున్నాయని నాకు అనిపిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఐఏఎస్ అధికారిగా కంటే బయట ఉండటమే మంచిదనీ, అప్పుడే నా పనులను స్వేచ్ఛగా చేసుకోగలనని భావిస్తున్నా. ఇక నేను ఎంతమాత్రం సర్వీసులో కొనసాగలేను. విధుల నుంచి అర్థాంతరంగా తప్పుకుంటున్నందుకు ప్రజలు నన్ను క్షమించాలి’ అని వ్యాఖ్యానించారు. కొన్నిరోజుల క్రితం దాద్రనగర్ హవేలీలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారి కణ్ణన్ గోపీనాథ్.. జమ్మూకశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దుకు నిరసనగా తన పదవికి రాజీనామా చేశారు.