India: తాజా గణాంకాలు... దేశ జనాభా లెక్కలు విడుదల!

  • 128.85 కోట్లకు భారత జనాభా
  • తెలంగాణలో 3.69 కోట్ల మంది
  • ఏపీలో 5.23 కోట్ల మంది జనాభా
జాతీయ జనాభా లెక్కల విభాగం తాజా గణాంకాల ప్రకారం దేశ జనాభా 128.85 కోట్లు. ఇదే సమయంలో నిమిషానికి 49 మంది జన్మిస్తుంటే, 15 మంది మరణిస్తున్నారు. 2017 గణాంకాలు విడుదల కాగా, జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకూ జనాభా 1.45 కోట్లు పెరిగింది.

ఇక తెలంగాణలో 3.69 కోట్ల మంది ఉండగా, జనాభా పరంగా 12వ స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ లో 5.23 కోట్ల మంది ఉండగా, 10వ స్థానంలో ఉంది. అత్యల్పంగా సిక్కిం 6.56 లక్షల జనాభాతో చిట్టచివరి స్థానంలో ఉంది. ఇక ఎప్పటిలానే ఉత్తరప్రదేశ్ జనాభా విషయంలో టాప్ లో నిలిచింది. ఈ రాష్ట్రంలో 22.26 కోట్ల మంది ఉన్నారు.
India
Population
Andhra Pradesh
Telangana

More Telugu News