Tirumala: తిరుమల వెంకన్న కోసం తయారైన గద్వాల 'ఏరువాడ వస్త్రాలు'!

  • నేడు స్వామికి అందనున్న కానుక
  • బ్రహ్మోత్సవాల సందర్భంగా అలంకరణ
  • తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం
తిరుమల వెంకన్నకు తెలంగాణలోని గద్వాల్ జోగులాంబ జిల్లా నుంచి వెళ్లే 'ఏరువాడ వస్త్రాలు'గా పిలిచే ప్రత్యేక జోడు పంచెలు సిద్ధమయ్యాయి. వీటిని నేడు స్వామివారికి కానుకగా అందించనున్నారు. జిల్లాకు చెందిన మహంకాళి కరుణాకర్‌, సురేష్‌ లు వీటిని భక్తి శ్రద్ధలతో నేసి, బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి సమర్పించడం ఆనవాయితీ అన్న సంగతి తెలిసిందే.

ఇదిలావుండగా, తిరుమలలో ఈ ఉదయం భక్తుల రద్దీ అత్యంత సాధారణంగా ఉంది. స్వామి సర్వ దర్శనం కోసం కేవలం ఒక్క కంపార్టుమెంట్ లో మాత్రమే భక్తులు వేచివున్నారు. ప్రత్యేక ప్రవేశం, టైమ్ స్లాట్ టోకెన్ సహా, అన్ని రకాల దర్శనాలకూ రెండు గంటల్లోపే సమయం పడుతోందని అధికారులు వెల్లడించారు.
Tirumala
Tirupati
Jogulamba Gadwal District
Eruvada

More Telugu News