Chandrababu: వంద రోజులైనా బాబాయి హంతకులను పట్టుకోలేనివారు.. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారట!: చంద్రబాబు ఎద్దేవా

  • హత్య కేసు నిందితుడి ఆత్మహత్య వెనుక అనుమానాలు
  • సూసైడ్ లేఖలో రెండు చేతి రాతలు
  • వైసీపీ బాధితుల పరిరక్షణ కోసం కమిటీ

మాజీ మంత్రి, వైసీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు నిందితుడు ఆత్మహత్య వెనక బోల్డన్ని అనుమానాలు ఉన్నాయని ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఆత్మహత్యకు ముందు నిందితుడు రాసిన సూసైడ్ లేఖలో రెండు చేతి రాతలు ఉన్నాయన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులైనా బాబాయిని చంపిన వారిని పట్టుకోలేకపోయారని, ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడతారని ప్రశ్నించారు. జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో 8 హత్యలు జరిగాయని, వందల కుటుంబాలు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు రోజురోజుకు క్షీణిస్తున్నాయని విమర్శించారు.

కాగా, వైసీపీ బాధితుల పరిరక్షణ కోసం చంద్రబాబు ఓ కమిటీని ఏర్పాటు చేశారు. నక్కా ఆనంద్‌బాబు, అశోక్ బాబు, గద్దె రామ్మోహన్, మద్దాల గిరి, మరో ఇద్దరు ఈ కమిటీలో సభ్యులుగా ఉన్నారు. బాధితుల శిబిరాన్ని ఈ కమిటీ పర్యవేక్షిస్తుంది.

More Telugu News