Andhra Pradesh: బైక్ ర్యాలీ రగడ.. నర్సీపట్నం పోలీసులకు ఘాటు వార్నింగ్ ఇచ్చిన అయ్యన్నపాత్రుడు!

  • నర్సీపట్నంలో లోకేశ్ బైక్ ర్యాలీకి అనుమతి నిరాకరణ
  • పోలీసులపై ముఖ్యమంత్రి ఒత్తిడి ఉందన్న అయ్యన్నపాత్రుడు
  • ఒళ్లు దగ్గరపెట్టుకుని పనిచేయాలని హెచ్చరిక

ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం జిల్లా నర్సీపట్నంలో ఈరోజు టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు పుట్టినరోజు వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేత నారా లోకేశ్ బైక్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. టీడీపీ కార్యకర్తలంతా హెల్మెట్లు పెట్టుకుంటేనే ర్యాలీకి అనుమతిస్తామని స్పష్టం చేశారు. తాజాగా ఈ వ్యవహారంపై టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు తీవ్రంగా స్పందించారు.

నర్సీపట్నం పోలీసుల తీరుపై మండిపడ్డారు. ‘ఇవాళ ఒళ్లు దగ్గర పెట్టుకుని పనిచేయండి. ఇంకో మూడేళ్లలో ఎన్నికలు రాబోతున్నాయి. అప్పుడు మీరంతా మా దగ్గరే పనిచేయాలి. అందుచేత న్యాయంగా వ్యవహరించండి’ అని పోలీసులను హెచ్చరించారు. తాము వైసీపీ నేతల్లా దౌర్జన్యాలు చేయబోమనీ, న్యాయంగా వ్యవహరిస్తామని చెప్పారు.

హెల్మెట్లు లేవని తమ ర్యాలీకి అనుమతి నిరాకరించారనీ, ఇలాంటి పద్ధతి రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి జగన్ ఒత్తిడి కారణంగానే పోలీసులు ఇలా వ్యవహరిస్తున్నారనీ, తప్పు పోలీసులది కాదని వ్యాఖ్యానించారు.

More Telugu News