లండన్ లోని భారత దౌత్య కార్యాలయం ముందు పాకిస్థానీయుల విధ్వంసం!
- మరోసారి హింసాత్మక ఘటనలు
- పగిలిన కిటికీలు, వాహనాల అద్దాలు
- కేసులు పెట్టామన్న లండన్ మేయర్
జరిగిన నిరసనలపై లండన్ మేయర్ సాధిక్ ఖాన్ స్పందిస్తూ, ఈ తరహా చర్యలను తాము ఉపేక్షించబోమని అన్నారు. పోలీసులు ఆందోళన కారులపై కేసులను నమోదు చేశారని చెప్పారు. కాగా, పాకిస్థాన్ మద్దతుదారులు కోడిగుడ్లు, చెప్పులు, రాళ్లను దౌత్య కార్యాలయంపైకి విసిరివేశారని స్థానిక మీడియా పేర్కొంది. ఈ ఘటనలో కొన్ని కిటికీలు, వాహనాల అద్దాలు పగిలాయని తెలిపారు. గత నెల 15వ తేదీన కూడా ఇదే ప్రాంతంలో పాక్ జాతీయులు నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే.