తమిళనాట బీజేపీ దళపతిగా రజనీకాంత్.... కలకలం రేపుతున్న కొత్త ప్రచారం!
- మొన్నటి వరకూ బీజేపీ చీఫ్ తమిళిసై
- తెలంగాణ గవర్నర్ గా నియామకం
- ఖాళీ అయిన పదవికి రజనీ పేరు పరిశీలన
కాగా, బీజేపీ అధ్యక్ష పదవి రేసులో హెచ్ రాజా, పార్థసారథి, రాధాకృష్ణన్ లు కూడా ఉన్నట్టు తెలుస్తుండగా, బీజేపీ అధిష్ఠానం మాత్రం, ప్రజల్లో మరింత పాప్యులారిటీ ఉన్న వారికే అవకాశం ఇవ్వాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరో ఐదు రోజుల పాటు చెన్నైలోనే గడపనున్న తమిళిసై, వచ్చే వారంలో హైదరాబాద్ కు వచ్చి తెలంగాణ గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈలోగానే రాష్ట్రానికి కొత్త అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందని తెలుస్తోంది.