Andhra Pradesh: వెరైటీగా వినాయక చవితి.. 2 లక్షల నెమలి పింఛాలతో గణేశుడి విగ్రహం ఏర్పాటు!

  • శ్రీకాకుళం జిల్లా పాలకొండలో వెరైటీ గణేశుడు 
  • దేశంలో ఇలా చేయడం ఇదే తొలిసారి
  • గిన్నిస్ రికార్డులో చేర్చేందుకు ప్రయత్నాలు మొదలు

ప్రస్తుతం వినాయక చవితి పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో వేర్వేరు రూపాల్లో గణనాథుడు దర్శనమిస్తున్నాడు. ఏపీ, తెలంగాణలో పలువురు భక్తులు వినాయకుడి విగ్రహాలకు ప్రత్యేకంగా మండపాలు ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా పాలకొండ నగర పంచాయతీలోని కాపువీధి వాసులు వినూత్న ప్రయత్నం చేశారు.

ఏకంగా 2 లక్షల నెమలి పింఛాలతో వినాయకుడి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఇలా పూర్తిగా నెమలి పింఛాలతో వినాయకుడిని తయారుచేయడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో ఈ వినాయకుడిని గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదు చేసేందుకు పాలకొండ వాసులు ప్రయత్నిస్తున్నారు. సాధారణంగా వినాయకుడి విగ్రహాన్ని మట్టి లేదా ప్లాస్టర్ ఆఫ్ పారిస్ తో తయారుచేస్తారు.

More Telugu News