Nara Lokesh: వైఎస్ జగన్ గారు ప్రజలను ఎలా మభ్యపెడతారు అనేదానికి ఇదో ఉదాహరణ: నారా లోకేశ్

  • గతంలో 'ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రం' పేరిట కంటి పరీక్షల పథకం ఉందంటూ లోకేశ్ వెల్లడి
  • ఇప్పుడా పథకానికి కూడా పేరు మార్చారంటూ మండిపాటు
  • కొత్త పథకాలంటూ డబ్బా కొట్టుకోవడం మాని నవరత్నాల సంగతి చూసుకోవాలంటూ హితవు

గత ప్రభుత్వ హయాంలో తాము ప్రవేశపెట్టిన పథకాలను పేరుమార్చి ప్రచారం చేసుకుంటున్నారంటూ వైసీపీ సర్కారుపై టీడీపీ యువనేత నారా లోకేశ్ మండిపడ్డారు. గతంలో చంద్రబాబు పాలనలో 'ముఖ్యమంత్రి ఇ-ఐ కేంద్రం' పేరిట కంటి పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేశారని, ఇప్పటివరకు ఆ కంటి పరీక్షల కేంద్రాల ద్వారా 10 లక్షల 80 వేల మంది సేవలు అందుకున్నారని లోకేశ్ ట్వీట్ చేశారు.

ఇదే విషయం జగన్ సర్కారు ఆధ్వర్యంలో ఉన్న 'ఆరోగ్య ఆంధ్ర' పోర్టల్ చూస్తే అర్థమవుతుందని, కానీ ఆ పథకాన్ని జగన్ సర్కారు తమదేనని డబ్బా కొట్టుకుంటోందని ఆరోపించారు. సరికొత్త పథకం అన్నట్టుగా జగన్ ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని విమర్శించారు. జగన్ ప్రభుత్వ పంథాకు ఇదో ఉదాహరణ అని తెలిపారు. ఇలాంటి పథకాలపై అసత్య ప్రచారం మాని, నవరత్నాల సంగతి చూసుకోవాలని లోకేశ్ హితవు పలికారు.

More Telugu News