Jayasudha: ఒక్కరే మహానటి కాదు... ప్రతి ఒక్కరూ మహానటే!: జయసుధ

  • టీఎస్సార్ అవార్డుల ప్రెస్ మీట్ లో జయసుధ వ్యాఖ్యలు
  • తన దృష్టిలో అందరూ మహానటీమణులేనన్న జయసుధ
  • జయసుధకు అభినయ మయూరి అవార్డు
సినీ పరిశ్రమ తీరుతెన్నులపై సీనియర్ నటి జయసుధ స్పందించారు. మహానటి అని మనం ఒక్కరినే పరిగణిస్తామని, కానీ ప్రతి ఒక్కరూ మహానటేనని, ఆ రేంజ్ లో నటించకపోతే ఇండస్ట్రీలో మనుగడ సాగించలేరని అభిప్రాయపడ్డారు. అందుకే తన దృష్టిలో అందరూ మహానటీమణులేనని అన్నారు.

 ప్రముఖ వ్యాపారవేత్త టి.సుబ్బరామిరెడ్డి తన టీఎస్సార్ కళాపరిషత్ అవార్డుల ప్రకటన సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి జయసుధ కూడా హాజరయ్యారు. జయసుధను అభినయ మయూరి అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లోని ఓ స్టార్ హోటల్ లో ప్రెస్ మీట్ చేశారు. ఈ సమావేశంలోనే జయసుధ పైవ్యాఖ్యలు చేశారు. ఇక సుబ్బరామిరెడ్డి గురించి చెబుతూ, సీనియర్ తారలను గుర్తుపెట్టుకుని ప్రతి ఏడాది సత్కరించడం చాలా గొప్ప విషయం అని ప్రశంసించారు.
Jayasudha
Tollywood
TSR

More Telugu News