Vijay Devarakonda: విజయ్ దేవరకొండ హీరోగా భారీ బాలీవుడ్ మూవీ?

  • యూత్ లో విజయ్ దేవరకొండకి విపరీతమైన క్రేజ్ 
  • బాలీవుడ్ బడా నిర్మాతల దృష్టిని ఆకర్షించిన హీరో 
  • బహు భాషా చిత్రంలో ఛాన్స్ అంటూ టాక్  
విజయ్ దేవరకొండ నుంచి ఇటీవల వచ్చిన 'డియర్ కామ్రేడ్' అంచనాలను అందుకోలేకపోయిందనేగానీ, ఆయన అభిమానులకు బాగానే సంతోషాన్ని కలిగించింది. ఈ సినిమా ఫలితం ఆయన కెరియర్ పై ఎంత మాత్రం ప్రభావం చూపించలేదు. అంతకుముందు మాదిరిగానే ఆయనతో సినిమాలు చేయడానికి నిర్మాతలు పోటీ పడుతున్నారు. తెలుగులోనే కాదు, బాలీవుడ్ లోని బడా నిర్మాతలు సైతం విజయ్ దేవరకొండతో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపుతున్నారు.

తెలుగుతో పాటు ఇతర భాషల్లోను విజయ్ దేవరకొండకి గల క్రేజ్ ను గుర్తించిన కరణ్ జొహార్ .. సిద్ధార్థ్ రాయ్ కపూర్ .. సాజిద్ నడయాడ్ వాలా, ఈ హీరోతో ఒక భారీ సినిమాను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ నెల 6వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నట్టుగా ఒక వార్త షికారు చేస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సోలో హీరోగా కనిపిస్తాడా? వేరే హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటాడా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.
Vijay Devarakonda

More Telugu News