Andhra Pradesh: కొబ్బరితోటల సాగును ఉపాధి హామీకి జతచేస్తాం!: ఏపీ వ్యవసాయ మంత్రి కురసాల కన్నబాబు

  • కొబ్బరి రైతులకు మేం అండగా నిలుస్తాం
  • తూర్పుగోదావరిలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు
  • త్వరలోనే విధాన ప్రకటనను వెలువరిస్తాం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొబ్బరి రైతులకు అన్నివిధాలుగా అండగా నిలవాలని నిర్ణయించుకుందని ఏపీ ఉద్యానవన, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. ఇందుకోసం తూర్పుగోదావరి జిల్లాలో కొబ్బరి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేయబోతున్నామని వెల్లడించారు. దీనికి సంబంధించి త్వరలోనే విధాన ప్రకటన వెలువడుతుందని పేర్కొన్నారు.

కొబ్బరితోటల సాగును ఉపాధి హామీ పథకానికి జత చేస్తామని కన్నబాబు చెప్పారు. ఒక్కో హెక్టార్ తోటకు మూడేళ్లకు గానూ రూ.2.80 లక్షలు అందజేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అలాగే వైఎస్సార్ రైతు భరోసా పథకంలో భాగంగా కొబ్బరి రైతులకు బీమా ప్రీమియంలో 75 శాతం రాయితీ ఇస్తామన్నారు.

రైతులను కొబ్బరి బోర్డుకు అనుసంధానం చేయడం ద్వారా రీప్లాంటింగ్ అండ్ రీజనరేషన్ కింద తెగులుతో దెబ్బతిన్న తోటల ప్రాంతంలో కొత్త తోటలను పెంచుకోవడం కోసం ప్రత్యేకంగా ఓ పథకాన్ని ప్రవేశపెడుతున్నట్లు మంత్రి కన్నబాబు తెలిపారు.

More Telugu News