Saaho: ప్రభాస్ వర్సెస్ ప్రభాస్... సాహో కలెక్షన్లను బాహుబలితో పోల్చిన తరణ్ ఆదర్శ్

  • ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్ల వివరాలు వెల్లడించిన తరణ్ ఆదర్శ్
  • బాహుబలి-2కి పెద్దపీట
  • బాహుబలి-1 కలెక్షన్లను అధిగమించిన సాహో

విడుదలకు ముందే ఎంతో హైప్ తెచ్చుకున్న సాహో మూవీ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇతర భాషల్లో ఈ సినిమాకు కాస్త నెగెటివ్ టాక్ వచ్చినా కలెక్షన్లపై మాత్రం ఆ ప్రభావం పడలేదు. మూడు రోజుల్లో దాదాపు రూ.300 కోట్ల సమీపానికి వచ్చింది. అయితే, సాహో హిందీ వెర్షన్ ఓపెనింగ్ వీకెండ్ కలెక్షన్లను ప్రముఖ సినీ విమర్శకుడు తరణ్ ఆదర్శ్ బాహుబలి చిత్రాల వసూళ్లతో పోలిక పెట్టారు.

2015లో వచ్చిన బాహుబలి ది బిగినింగ్ చిత్రం రూ.22.35 కోట్లు సాధించిందని, 2017లో వచ్చిన బాహుబలి ది కంక్లూజన్ సినిమా రూ.128 కోట్లు కొల్లగొట్టిందని తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశాడు. సాహో చిత్రానికి రూ.79.08 కోట్లు వసూలయ్యాయని తన ట్వీట్ లో వివరించారు. ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ అంటూ తన ట్వీట్ కు శీర్షిక పెట్టారు. సాహో చిత్రం రిలీజ్ రోజున తరణ్ ఆదర్శ్ ఇచ్చిన రివ్యూ అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. తరణ్ ఆదర్శ్ తన రివ్యూలో సాహో ఒక భరించలేని చిత్రం అంటూ ఒక్క మాటలో తేల్చేశాడు.

More Telugu News