ఆర్టికల్ 370 రద్దుపై తొలుత మీ అభిప్రాయం ఏంటో చెప్పండి: రాహుల్, శరద్ పవార్‌కు అమిత్ షా సూటి ప్రశ్న
- త్వరలో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు
- ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత తొలి అసెంబ్లీ ఎన్నికలు
- ఎన్నికలకు ముందే తమ వైఖరేంటో చెప్పాలని నిలదీత
మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర పఢ్నవిస్‌తో కలిసి ‘మహాజన్‌దేశ్’ యాత్ర ర్యాలీలో పాల్గొన్న షా మాట్లాడుతూ ఈ డిమాండ్ చేశారు. ఆర్టికల్ 370, 35ఎ రద్దు తర్వాత అసెంబ్లీ ఎన్నికలకు వెళ్తున్న తొలి రాష్ట్రం మహారాష్ట్రేనన్నారు. కాబట్టి ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ, శరద్ పవార్‌లు వీటిపై తమ కచ్చితమైన అభిప్రాయాన్ని వెల్లడించాలని అమిత్ షా డిమాండ్ చేశారు.