Train: ఆసక్తికరం... రైలెక్కే వారిలో 'హడావుడి బ్యాచ్' అధికం!

  • 2016 నుంచి 2019 మధ్య తత్కాల్ ఆదాయం రూ. 21,530 కోట్లు
  • నానాటికీ పెరుగుతున్న చివరి క్షణంలో టికెట్లు కొనేవారి సంఖ్య
  • స.హ చట్టాన్ని వాడి తెలుసుకున్న వ్యక్తి

రైలు ప్రయాణం చేయాలనుకునే వారిలో చివరి క్షణంలో... అంటే ఒకటి, రెండు రోజుల ముందు హడావుడిగా టికెట్ల కోసం ప్రయత్నించేవారు, తత్కాల్ ను ఆశ్రయించేవారి సంఖ్యే అధికమని తేలింది. సమాచర హక్కు చట్టాన్ని ఉపయోగించుకుని, ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు రైల్వే శాఖ సమాధానం ఇవ్వగా, పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి. ఒక్క తత్కాల్ టికెట్ల అమ్మకాల ద్వారానే రూ. 25,392 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. 2016 నుంచి 2019 మధ్య తత్కాల్ ద్వారా రూ. 21,530 కోట్లు, ప్రీమియం తత్కాల్ ద్వారా రూ. 3,862 కోట్ల ఆదాయం లభించింది.

అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది 62 శాతం అధికం కావడం గమనార్హం. చివరి నిమిషంలో ప్రయాణించే వారి సౌకర్యార్థం 1997లో తత్కాల్ సేవలు ప్రారంభం కాగా, తొలుత 30 శాతం వరకూ అదనంగా చెల్లించాల్సివుండేది. ఆపై 2014లో డైనమిక్ సిస్టమ్ ను ప్రవేశపెట్టగా, 50 శాతం అధిక రుసుముపై టికెట్ల జారీ ప్రారంభమైంది. నిత్తమూ తత్కాల్ స్కీమ్ కింద 2,677 రైళ్లలో 1.71 లక్షల సీట్లు, బెర్తులు అందుబాటులో ఉంటుండగా, ప్రధాన రైళ్లలో వీటికి కూడా వెయిటింగ్ లిస్ట్ అధికమే.

More Telugu News