Mahesh Babu: తన కుమారుడిపై మహేశ్ బాబు భావోద్వేగ ట్వీట్!

  • నిన్న గౌతమ్ పుట్టినరోజు
  • సమయం ఎలా గడిచిందో తెలియడం లేదు
  • ఇదే బెస్ట్ పిక్చర్ అంటూ ఫోటో షేర్
టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబు, తన కుమారుడు టీనేజ్ లోకి వచ్చిన సందర్భంగా భావోద్వేగం నిండిన ట్వీట్ పెట్టగా, అదిప్పుడు వైరల్ అవుతోంది. నిన్న గౌతమ్ 13వ ఏట అడుగు పెట్టగా, ఆ విషయాన్ని నమ్రత తెలియజేస్తూ, తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో ఫోటోలను షేర్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ ఉదయం మహేశ్, ఓ ఫోటోను అభిమానులతో పంచుకుంటూ, "ఇదే బెస్ట్ ఎవర్ పిక్చర్. నువ్విప్పుడు టీనేజ్ లోకి వచ్చావు. సమయం ఎలా గడిచిపోయిందో తెలియడం లేదు. లవ్ యూ మై బాయ్ గౌతమ్" అని వ్యాఖ్యానించాడు.

ప్రస్తుతం మహేశ్ బాబు, 'సరిలేరు నీకెవ్వరు' చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుండగా, రష్మిక మందన, మహేశ్ పక్కన తొలి సారిగా జోడీ కడుతోంది. ఇదే చిత్రంలో విజయశాంతి, తన సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తోందన్న సంగతి తెలిసిందే.
Mahesh Babu
Goutam
Twitter
Tenage

More Telugu News