Prabhas: ప్రపంచవ్యాప్తంగా 'సాహో' తొలిరోజు వసూళ్లు 130 కోట్లు

  • నిన్ననే విడుదలైన 'సాహో'
  • భారీ ఓపెనింగ్స్ తో కొత్త రికార్డులు 
  • మరింతగా పెరగనున్న వసూళ్లు

ప్రభాస్ కథానాయకుడిగా సుజీత్ దర్శకత్వంలో రూపొందిన 'సాహో' నిన్ననే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబడుతూ కొత్త రికార్డులు సృష్టించింది. యూవీ క్రియేషన్స్ వారు 350 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా, టాక్ తో సంబంధం లేకుండా, ప్రపంచవ్యాప్తంగా తొలిరోజున 130 కోట్ల గ్రాస్ ను వసూలు చేయడం విశేషం.

వీకెండ్ కారణంగా ఈ రోజు .. రేపు కూడా ఈ సినిమా వసూళ్లకు ఢోకా ఉండదు. ఇక సోమవారం రోజున 'వినాయకచవితి' పండుగ సెలవు కావడం వలన, ఆ రోజున కూడా వసూళ్లు బాగానే ఉంటాయి. శుక్రవారం వరకూ మరో సినిమా లేకపోవడం వలన, ఈ వసూళ్లు మరింతగా పెరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. శ్రద్ధా కపూర్ కథానాయికగా నటించిన ఈ సినిమాలో, జాకీ ష్రాఫ్ .. చుంకీ పాండే .. నీల్ నితిన్ ముకేశ్ .. అరుణ్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించారు.

More Telugu News