Sensex: రెండు రోజుల నష్టాలకు బ్రేక్.. లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • 264 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 75 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
  • మార్కెట్లను నడిపించిన బ్యాంకింగ్ స్టాకులు

దేశీయ స్టాక్ మార్కెట్లు రెండు రోజుల నష్టాలకు ముగింపు పలికి... ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈనాటి ఇంట్రాడే ట్రేడింగ్ లో మధ్యాహ్నం 1.30 గంటల వరకు నష్టాల్లో కొనసాగిన మార్కెట్లు... ఆ తర్వాత భారీగా పెరిగాయి. బ్యాంకింగ్ షేర్ల అండతో లాభాల బాట పట్టాయి.  

ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 264 పాయింట్లు లాభపడి 37,333కు పెరిగింది. నిఫ్టీ 75 పాయింట్లు పుంజుకుని 11,023కి ఎగబాకింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
యస్ బ్యాంక్ (5.32%), సన్ ఫార్మా (3.96%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (3.41%), టాటా స్టీల్ (3.35%), వేదాంత లిమిటెడ్ (3.24%).

టాప్ లూజర్స్:
పవర్ గ్రిడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (-1.85%), ఓఎన్జీసీ (-1.78%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-1.31%), ఎల్ అండ్ టీ (-1.11%), కొటక్ మహీంద్రా బ్యాంక్ (-1.10%).

More Telugu News