Pawan Kalyan: మోదీ, అమిత్ షాలను కలుస్తా: పవన్ కల్యాణ్

  • రాజధానిని మార్చుతామని లీకులు ఇవ్వడం సరికాదు
  • ఇప్పటికే రాష్ట్ర విభజనతో చాలా నష్టపోయాం
  • రాష్ట్ర సమస్యలను మోదీ, అమిత్ షాలకు వివరిస్తా

అమరావతి ప్రాంతంలో పర్యటిస్తున్న జనసేనాని పవన్ కల్యాణ్ కొండవీటి వాగు వద్ద వంతెన పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాజధాని అంశంపై మంత్రులు బాధ్యతతో మాట్లాడాలని సూచించారు. రాజధాని పనుల్లో అవినీతి జరిగితే విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని అన్నారు. రాజధానిని మార్చుతామంటూ లీకులు ఇవ్వడం సరికాదని చెప్పారు.

మంత్రి బొత్స చెప్పినట్లుగా అమరావతిలో రాజధాని వద్దని తాను ఎప్పుడూ చెప్పలేదని పవన్ అన్నారు. రైతుల నుంచి బలవంతంగా భూములను లాక్కోవద్దని మాత్రనే చెప్పానని గుర్తు చేశారు. ఒక పార్టీకి చెందిన నేతలుగా మంత్రులు వ్యవహరించరాదని... ఏపీ ప్రభుత్వంలో భాగంగా వ్యహరించాలని చెప్పారు. ఇప్పటికే రాష్ట్ర విభజనతో ఎంతో నష్టపోయామని... ఇప్పుడు ఇలాంటి గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేకూరుతుందని అన్నారు. గందరగోళ నిర్ణయాలతో మరింత నష్టం చేయాలనుకుంటే... తాను కూడా బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలను కలుస్తానని... రాష్ట్రంలోని సమస్యలు, పరిస్థితులను వారికి వివరిస్తానని చెప్పారు.

More Telugu News