america: దూసుకొస్తున్న డోరియన్ హరికేన్.. ఎమర్జెన్సీ ప్రకటించిన ఫ్లోరిడా

  • బుధవారం వర్జిన్ దీవులను తాకిన ‘డోరియన్’
  • అప్రమత్తమైన ఫ్లోరిడా 
  • వారానికి సరిపడా అన్నీ సిద్ధం చేసుకోవాలని పౌరులకు సూచన

అమెరికాలోని ఫ్లోరిడా రాష్ట్రం ఎమర్జెన్సీ ప్రకటించింది. హరికేన్ డోరియన్ సమీపిస్తుండడంతో గురువారం అత్యవసర పరిస్థితి ప్రకటించింది. తుపానును ఎదుర్కొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టింది. ప్రతి ఒక్కరికీ కనీసం వారం రోజులకు సరిపడా గ్రాసం ఉండేలా చూసుకోవాలని పౌరులకు సూచించింది. ఆహారం, నీళ్లు, మందులు తదితర వాటిని వారానికి సరిపడా దగ్గర పెట్టుకోవాలని ఫ్లోరిడా గవర్నర్ రాన్ డిశాంటిస్ పేర్కొన్నారు.

డోరియన్ హరికేన్ బుధవారం అమెరికాలోని వర్జిన్ దీవులను తాకింది. దీనిని ఒకటో కేటగిరీగా పరిగణిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్ట్ ట్రంప్ కూడా హరికేన్‌ డోరియన్‌పై స్పందించారు. తుపానును ఎదుర్కొనేందుకు అన్ని చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు.

More Telugu News