చంద్రయాన్-1 రికార్డులు బద్దలుగొట్టిన చంద్రయాన్-2
- చంద్రుడి మూడో కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశపెట్టిన శాస్త్రవేత్తలు
- ల్యాండర్ విడివడడానికి ముందు మరో మూడు విన్యాసాలు
- సెప్టెంబరు 7న చంద్రుడిపై ల్యాండ్ కానున్న విక్రమ్
ప్రొపల్షన్ సిస్టంను ఉపయోగించి చంద్రయాన్ 2 అంతరిక్ష నౌకను విజయవంతంగా చంద్రుడి మూడో కక్ష్యలోకి ప్రవేశపెట్టినట్టు తెలిపింది. అంతరిక్ష నౌక నుంచి విక్రమ్ ల్యాండర్ వేరు పడడానికి ముందు మరో మూడు విన్యాసాలు నిర్వహించాల్సి ఉందని శాస్త్రవేత్తలు వివరించారు. సెప్టెంబరు 7న విక్రమ్ జాబిల్లిపై ల్యాండ్ కానుంది.