Prime Minister: సెప్టెంబరు 17న మోదీ జన్మదినం..‘సేవా సప్తాహ్’ పేరుతో కార్యక్రమాలు

  • దేశ వ్యాప్తంగా వారం రోజుల పాటు ‘సేవా సప్తాహ్’ 
  • సెప్టెంబర్ 14 నుంచి 20 వరకూ పలు కార్యక్రమాలు
  • రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహణ
ప్రధాని మోదీ జన్మదినం నేపథ్యంలో వేడుకలు నిర్వహించేందుకు బీజేపీ సిద్ధమవుతోంది. సెప్టెంబరు 17న మోదీ జన్మదినం. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా సెప్టెంబర్ 14 నుంచి 20 వరకూ ‘సేవా సప్తాహ్’ పేరుతో పలు కార్యక్రమాలను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా స్వచ్ఛభారత్’, సామాజిక సేవా కార్యక్రమాలను పార్టీ కార్యకర్తలు నిర్వహిస్తారని సమాచారం. రక్తదాన శిబిరాలు, హెల్త్ క్యాంప్స్ నిర్వహిస్తారని, ఆసుపత్రులను, అనాథ శరణాలయాలను పార్టీ కార్యకర్తలు సందర్శించి తగు సాయం చేయడం వంటి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని బీజేపీ వర్గాలు తెలిపాయి. 
Prime Minister
modi
Birthday
september
17th

More Telugu News