kasi Vishwanath: డైరెక్టర్ గా నిలబడాలనుకున్న నేను నటుడిగా బిజీ అయ్యాను: కాశీ విశ్వనాథ్

  • డైరెక్టర్ గా నిలబడాలనుకున్నాను 
  • నటుడిగా మంచి పేరు వచ్చింది 
  • ఈ జర్నీ ఆనందంగా వుందన్న కాశీ విశ్వనాథ్
'నువ్వులేక నేను లేను' .. 'తొలి చూపులోనే' సినిమాలతో కాశీ విశ్వనాథ్ దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరువాత ఆయన నటన దిశగా అడుగులు వేశారు. ఆ ప్రయాణం గురించి తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడారు. "అందరూ కూడా నా తొలి సినిమా 'నచ్చావులే' అనుకుంటారు. కానీ అంతకు చాలా కాలం క్రితమే నేను 'జయం మనదేరా' సినిమాలో కనిపించాను. డైలాగ్స్ లేకపోవడం వలన జనం అంతగా గుర్తుంచుకోలేదు.

'నచ్చావులే'లో పాత్ర మంచి గుర్తింపు తీసుకురావడంతో, నటుడిగా వెనుదిరిగి చూసుకోలేదు. ఇంతవరకూ 150 సినిమాలకి పైగా చేశాను. నటుడు కావాలనే ఆశతో వచ్చి అవకాశం రానివాళ్లు చాలామంది వుంటారు. అలాంటిది డైరెక్టర్ గా నిలబడాలనుకున్న నేను నటుడిగా బిజీ అయ్యాను. నటుడిగా నా కెరియర్ టర్న్ తీసుకోవడం .. మంచి పేరు రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను" అని చెప్పుకొచ్చారు.
kasi Vishwanath

More Telugu News