Chidambaram: చిదంబరంను అరెస్ట్ చేయడం సంతోషకరం: ఇంద్రాణి ముఖర్జియా

  • కార్తీ చిదంబరం బెయిల్ కూడా రద్దు చేయాలన్న ఇంద్రాణి
  • ఐఎన్ఎక్స్ కేసులో అప్రూవర్ గా మారిన ఇంద్రాణి
  • చిదంబరం, కార్తీలకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పిన వైనం

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి చిదంబరంను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై అదే కేసులో అప్రూవర్ గా మారిన ఇంద్రాణి ముఖర్జియా స్పందించారు. చిదంబరంను అరెస్ట్ చేయడం సంతోషించదగ్గ విషయమని చెప్పారు. చిదంబరం కుమారుడు కార్తీ బెయిల్ కూడా రద్దు కావాలని తాను కోరుకుంటున్నట్టు తెలిపారు.

ఐఎన్ఎక్స్ మీడియా కేసులో అప్రూవర్ గా మారిన అనంతరం కోర్టులో చిదంబరం, ఆయన కుమారుడు కార్తీలకు వ్యతిరేకంగా ఇంద్రాణి సాక్ష్యం చెప్పారు. పెట్టుబడులు పెట్టేందుకు ఎఫ్ఐపీబీ నుంచి అనుమతులు రాలేదని.. దీంతో, తాము అప్పటి ఆర్థిక మంత్రి చిదంబరంను కలవగా... తన కుమారుడు కార్తీని కలవాలని ఆయన తమకు సూచించారని చెప్పారు. ఢిల్లీలోని ఓ హోటల్ లో కార్తీని తాము కలిశామని... డీల్ కుదిరిన తర్వాత కార్తీ చిదంబరం కంపెనీలకు తాము నగదు బదిలీ చేశామని కోర్టుకు తెలిపారు.

More Telugu News