17 ఏళ్ల అమ్మాయిపై లైంగిక వేధింపులు.. మరాఠీ నటుడి అరెస్ట్
- ఈ నెల 23నే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
- బాలికతో బలవంతంగా బికినీ తొడిగించి ఫొటోలు
- పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలిక తల్లి
ఆమెకు నటించే అవకాశం కల్పిస్తానని చెప్పి ఓ డ్రెస్ ఇచ్చి ధరించమని చెప్పాడు. అనంతరం ఆ డ్రెస్లో ఆమె ఫొటోలు తీసుకున్నాడు. ఆ తర్వాత బికినీ ఇచ్చి దానిని వేసుకోవాల్సిందిగా కోరాడు. అందుకు ఆమె నిరాకరించడంతో గతంలో తాను తీసిన ఇతర అమ్మాయిల ఫొటోలు చూపించాడు. దీంతో ఆమె ఆ డ్రెస్ ధరించి ఫొటోలకు పోజిచ్చింది. అనంతరం ఇంటికెళ్లిన బాలిక విషయాన్ని తన తల్లితో చెప్పగా, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తెలిపారు.