Pakistan: భారత్‌తో యుద్ధం దిశగా పాక్ అడుగులు.. త్వరలో క్షిపణి పరీక్ష?

  • నోటమ్, నేవల్ హెచ్చరికలు జారీ చేసిన పాక్
  • క్షిపణి పరీక్షపై సంకేతాలు
  • హద్దులు దాటుతున్న పాక్ హెచ్చరికలు

అక్టోబరులో భారత్‌తో యుద్ధం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించిన పాకిస్థాన్ ఇప్పుడు క్షిపణి పరీక్షకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. పాక్ అధికారులు బుధవారం ఎయిర్‌ఫోర్స్, నేవల్ అధికారులకు హెచ్చరికలు జారీ చేయడంతో క్షిపణి పరీక్ష వార్తలకు మరింత బలం చేకూరింది. దీనికి తోడు సైనిక విన్యాసాలు కూడా ఉంటాయని చెప్పడం ఈ వార్తలను మరింత బలపరుస్తోంది. కరాచీ సమీపంలోని సోన్మియాని పరీక్ష కేంద్రం నుంచి ఈ క్షిపణిని పరీక్షించే అవకాశాలు ఉన్నాయని సమాచారం.

అక్టోబరు లేదంటే నవంబరులో ఇరు దేశాల మధ్య యుద్ధం వచ్చే అవకాశం ఉందని, బహుశా ఈ రెండు దేశాల మధ్య ఇదే చివరిది కావొచ్చంటూ పాక్ రైల్వే మంత్రి షేక్ రషీద్ బుధవారం చేసిన వ్యాఖ్యలు పాక్ ఉద్దేశాన్ని బయటపెట్టాయి. అంతకుముందు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా కశ్మీర్‌పై నిర్ణయాత్మక యుద్ధానికి సమయం దగ్గరపడిందని వ్యాఖ్యానించారు. ఆ వెంటనే నోటమ్ (నోటీస్ టు ఎయిర్‌మెన్), నేవల్ హెచ్చరికలు జారీ చేయడంతో క్షిపణి పరీక్ష జరగబోతోందన్న సంకేతాలు వెలువడుతున్నాయి.

More Telugu News