సుహాసినీగారిని అదే మాట అడిగాను: ఆశ్రిత వేముగంటి
- 'యాత్ర'లో మంచి పాత్ర చేశాను
- సుహాసినిగారితో కలిసి నటించడం అదృష్టం
- ఆమె చాలా డీసెంట్ అని చెప్పిన ఆశ్రిత
నేను ఆమె దగ్గరికి వెళ్లి 'ఇంతకాలంగా సినిమాలు చేస్తూ ఇంత క్రేజ్ ను సంపాదించుకున్నారు గదా, అయినా ఇంత సింపుల్ గా మీ జర్నీని ఎలా కొనసాగిస్తూ వస్తున్నారు?' అని అడిగాను. అందుకు ఆమె స్పందిస్తూ .. "నేను ఎప్పుడూ కూడా క్రేజ్ ను తలకెత్తుకోను .. ప్రతి పాత్రను ఒక పాఠంగా భావించి, ఒక విద్యార్థిలా అర్థం చేసుకుంటూ వెళతాను. అనుభవాలే అణకువను నేర్పాయి" అని ఆమె చెప్పుకొచ్చారంటూ ఆశ్రిత వేముగంటి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు.