Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించిన తెలంగాణ మంత్రి కొప్పుల

  • ఈ ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్న మంత్రి ఈశ్వర్‌
  • ప్రత్యేక పూజల అనంతరం ముక్కుపుడక సమర్పణ
  • రెండు రాష్ట్రాలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్ష
తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఈరోజు ఉదయం విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరి ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు. అమ్మవారికి ముక్కుపుడక సమర్పించారు. కుటుంబ సభ్యులతో అమ్మవారి సన్నిధికి చేరుకున్న మంత్రి ప్రత్యేక పూజల అనంతరం అమ్మవారికి ఆభరణాన్ని అందించారు. తొలుత మంత్రికి సాదర స్వాగతం పలికిన ఈఓ సురేష్‌బాబు, అర్చకులు పూజల అనంతరం అమ్మవారి ప్రసాదం, చిత్రపటం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు ఎల్లకాలం కొనసాగి, రెండు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ప్రయాణించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
Vijayawada
indrakiladri
kanakadurgamma
Koppula Eshwar

More Telugu News