Ashrita Vemuganti: ముందుగా 'జర్నీ' సినిమాలో చేసే అవకాశం వచ్చింది: ఆశ్రిత వేముగంటి

  • భరతనాట్యం అంటే ఇష్టం 
  • అమ్మ ఆ సినిమా చేయనీయలేదు
  • సినిమాల్లోకి పంపించడానికి ఆమె భయపడిందన్న ఆశ్రిత
'బాహుబలి 2' సినిమాలోని 'కన్నా నిదురించరా' అనే పాటలో నర్తించిన ఆశ్రిత వేముగంటికి మంచి గుర్తింపు వచ్చింది. ఆకర్షణీయమైన ఆమె కళ్లు .. అందమైన ఆమె నవ్వుకు అభిమానులు పెరిగిపోయారు. తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, "మొదటి నుంచి కూడా నాకు భరతనాట్యం అంటే ఇష్టం. మా అమ్మగారు కూడా నన్ను ఒక నాట్యకళాకారిణిగానే చూడాలనుకున్నారు.

'బాహుబలి 2' కంటే ముందుగానే నాకు సినిమాల్లో అవకాశాలు రావడం మొదలుపెట్టాయి. నేను ఒక క్యాంటీన్ లో ఉండగా చూసి, 'ఎంగేయుమ్ ఎప్పొదుమ్' (తెలుగులో 'జర్నీ') సినిమా కోసం అడిగారు. ఆడిషన్స్ కి కూడా వెళ్లాను. కానీ 'సినిమా అనేది మనకి తెలియని ప్రపంచం' అంటూ అమ్మ భయపడింది. భరతనాట్యం పైనే పూర్తి దృష్టి పెట్టమని అమ్మ అనడంతో నేను ఆ సినిమా చేయలేదు" అని చెప్పుకొచ్చారు.
Ashrita Vemuganti

More Telugu News