370 article: అక్టోబర్‌ మొదటి వారంలో 'ఆర్టికల్‌ 370' పిటిషన్లపై సుప్రీం విచారణ.. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు!

  • ఐదుగురు న్యాయమూర్తులతో రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు
  • అధికరణ రద్దును సవాల్‌ చేస్తూ 15 పిటిషన్లు దాఖలు
  • అన్ని పిటిషన్లను విచారించనున్న ధర్మాసనం

జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రానికి స్వయం ప్రతిపత్తిని కల్పించే రాజ్యాంగంలోని 370 అధికరణను రద్దు చేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లపై అక్టోబర్‌ మొదటి వారంలో విచారణ చేపట్టనున్నట్లు భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. ఇందుకోసం ఐదుగురు న్యాయమూర్తులతో కూడిన రాజ్యాంగ ధర్మాసనాన్ని ఏర్పాటు చేసిన ఎపెక్స్‌ కోర్టు, అన్ని పిటిషన్లను ఈ ధర్మాసనమే విచారిస్తుందని తెలిపింది. పిటిషన్లపై స్పందన తెలియజేయాలంటూ కేంద్రం, జమ్మూ కశ్మీర్ పాలనా యంత్రాంగాలకు నోటీసులు జారీ చేసింది.

370 అధికరణ రద్దుతోపాటు, రాష్ట్రాన్ని రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించడాన్ని సవాల్ చేస్తూ మొత్తం 15 పిటిషన్లు దాఖలు కాగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి నేతృత్వంలోని ప్రత్యేక ధర్మాసనం ఈరోజు విచారణ జరిపింది. రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది.

More Telugu News