Article 370: ఆర్టికల్ 370పై సమాచారం ఇచ్చేందుకు కేంద్రం నిరాకరణ

  • వివరాలు కోరిన లక్నో కార్యకర్త
  • అటువంటి సమాచారాన్ని ఇవ్వలేమన్న సీపీఐవో
  • ఆర్టీఏ చట్టం సెక్షన్ 8(1) ప్రకారం సాధ్యం కాదని స్పష్టీకరణ
జమ్మూ కశ్మీర్‌కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370కి సంబంధించిన వివరాలను ఇచ్చేందుకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ నిరాకరించింది. రాజ్యాంగం కల్పించిన ఆర్టికల్ 370 రద్దుకు సంబంధించిన ప్రభుత్వ దస్త్రం వివరాలు కావాలంటూ ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోకు చెందిన హక్కుల కార్యకర్త నూతన్ ఠాకూర్ సమాచార హక్కు చట్టం ద్వారా దరఖాస్తు చేసుకున్నారు. ఆయన అడిగిన వివరాలను ఇచ్చేందుకు సెంట్రల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ (సీపీఐవో) నిరాకరించారు. ఆర్టీఏ చట్టం సెక్షన్ 8(1) ప్రకారం ఓ పౌరుడికి ఇటువంటి సమాచారం ఇవ్వడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది.


Article 370
Jammu And Kashmir
CPIO

More Telugu News