Andhra Pradesh: రాజధాని రైతులకు శుభవార్త... కౌలు డబ్బులు విడుదల చేసిన ఏపీ సర్కారు!

  • రాజధానికి భూములిచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లింపు
  • ఈ ఏడాది ఆలస్యమైన చెల్లింపు
  • ఆందోళనకు దిగిన రైతులు
  • రూ.187.40 కోట్లు విడుదల చేసిన ఏపీ సర్కారు!
గత కొన్నిరోజులుగా ఏపీ రాజధాని రైతుల కౌలు డబ్బుల విషయంలో గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ అనిశ్చితికి ఏపీ సర్కారు తెరదించింది. రాజధాని ప్రాంత రైతులకు రావాల్సిన రూ.187.40 కోట్ల కౌలు నిధులను సర్కారు విడుదల చేసింది. తమ కౌలు డబ్బులు చెల్లించాలంటూ ఆందోళన చేస్తున్న రాజధాని రైతులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం జీవో జారీ చేసింది. కౌలు చెల్లింపు కోసం ఏర్పాట్లు చేయాలంటూ సీఆర్డీయే, పురపాలక శాఖలకు స్పష్టం చేసింది. రాజధాని అమరావతి నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు రూపేణా జూన్ మొదటి వారంలో వారి ఖాతాల్లో నగదు జమ అయ్యేది. అయితే, ఆగస్టు ముగస్తున్నా కౌలు డబ్బులు విడుదల కాకపోవడంతో రైతులు కొన్నిరోజులుగా ఆందోళన కార్యక్రమాలకు దిగారు.
Andhra Pradesh
Amaravathi
Jagan

More Telugu News