crows: వానరంలో కారుణ్యం...కాకుల దాడి నుంచి పిల్లి కూనను రక్షించిన మూగజీవి

  • పిల్లిని చంపేందుకు వెంటపడిన కాకుల గుంపు
  • పొడుచుకు తింటుండడంతో వణికిన పిల్లికూన
  • చెట్టుపై నుంచి గమనించి అడ్డుకున్న కోతి

మూగ జీవాల్లోనూ దయ, కారుణ్యం పుష్కలమని నిరూపించిన ఘటన ఇది. తన పిల్ల కాదు...తన జాతి కాదు...కానీ కారుణ్యమే ఆ వానరాన్ని ప్రాణాలకు తెగించి పోరాడేలా చేసింది. ఓ పిల్లి పిల్లను రక్షించింది. వివరాల్లోకి వెళితే...ఆదిలాబాద్‌ జిల్లా నార్నూర్‌ మండల కేంద్రంలోని అంబేడ్కర్‌ నగర్‌లో సోమవారం చిన్న పిల్లిపిల్లను ఓ కాకుల గుంపు వెంటాడింది.

 దాన్ని చంపేసేందుకు కాకులన్నీ దాడి చేయడంతో ప్రాణభయంతో పిల్లిపిల్ల వణికిపోయింది. దీన్ని దూరంలో చెట్టుపై నుంచి గమనించిన ఓ  వానరం వెంటనే రంగంలోకి దిగింది. పిల్లి వెంటపడిన కాకులతో పోరాటానికి దిగింది. అయినా కాకులు పిల్లిని వదలక పోవడంతో సాహసం చేసి పిల్లిపిల్లను తన ఒడిలోకి తీసుకుని కాకుల్ని దగ్గరకు కూడా రానివ్వలేదు. వానరం వద్ద తమ పప్పులు ఉడకవని భావించిన కాకులు నిరాశతో ఎగిరిపోయాయి.

More Telugu News