Ramgopal Varma: 'కమ్మలు... కాపులు... రెడ్లు... రాజులు' వర్మ కొత్త చిత్రం నుంచి 'క్యాస్ట్ ఫీలింగ్' సాంగ్ వచ్చేసింది!

  • 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రం తీస్తున్న వర్మ
  • కొద్దిసేపటి క్రితం ఓ సాంగ్ రిలీజ్
  • సినిమాలో సందర్భానుసారంగా వస్తుందని వెల్లడి

తాను నూతనంగా నిర్మిస్తున్న 'కమ్మ రాజ్యంలో కడప రెడ్లు' చిత్రంలోని 'క్యాస్ట్ ఫీలింగ్' సాంగ్ ను రామ్ గోపాల్ వర్మ కొద్దిసేపటి క్రితం విడుదల చేశారు. "కమ్మలు... కాపులు... రెడ్లు... రాజులు... వైశ్యులు..." అంటూ ఈ పాట మొదలవుతుంది. "నేను, నా దేశం నా ఊరు, నా కుటుంబం... నా మతమూ, నా స్నేహితులు, నా బంధువులు, నా పిల్లలు... ఈ ఫీలింగ్ లన్నీ కరెక్టయినపుడు, క్యాస్ట్ ఫీలింగ్ ఎందుకు తప్పు? దేనికిరా... ఈ హిపోక్రసీ? ఎందుకురా... ఈ హిపోక్రసీ? అంటూ పాట సాగుతుంది. దేశాన్ని కీర్తిస్తే దేశ భక్తి అయినప్పుడు, కులాన్ని కీర్తించే కుల భక్తి ఎందుకు తప్పని ప్రశ్నించారు. ఈ పాటకు ముందు క్యాస్ట్ ఫీలింగ్ పై వర్మ సెటైర్లు కూడా వేశారు. మీడియాలో వచ్చే స్లోగన్స్ ను ప్రస్తావిస్తూ, విరుచుకుపడ్డారు. ఈ పాట సినిమాలో సందర్భానుసారంగా వస్తుందని వెల్లడించారు. 

More Telugu News