సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- సంక్రాంతి రేసులో మరో సినిమా
- శేఖర్ కమ్ముల సినిమా అప్ డేట్
- బల్గేరియాకు రాజమౌళి యూనిట్
* శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ చిత్రం తొలి షెడ్యూలు షూటింగ్ నిన్న మొదలవ్వాలి. అయితే, సెప్టెంబర్ 5 నుంచి ఈ షెడ్యూలు జరుగుతుందని తాజా సమాచారం. తెలంగాణ పల్లె వాతావరణం నేపథ్యంలో ఇది రూపొందుతుంది.
* రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' చిత్రం షూటింగును త్వరలో బల్గేరియాలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. మూడు వారాల షూటింగ్ కోసం చిత్రం యూనిట్ త్వరలో అక్కడికి వెళ్లనుంది. ఎన్టీఆర్, చరణ్ ఇందులో హీరోలుగా నటిస్తున్న సంగతి తెలిసిందే.