Arun Jaitly: ముగిసిన అరుణ్ జైట్లీ అంత్యక్రియలు... కన్నీటిని ఆపుకోలేకపోయిన వెంకయ్యనాయుడు!

  • ఢిల్లీ నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో జైట్లీ అంతిమసంస్కారాలు
  • జైట్లీ చితికి నిప్పంటించిన కుమారుడు రోహన్
  • తీవ్ర భావోద్వేగాలకు లోనైన వెంకయ్యనాయుడు!
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ అంత్యక్రియలు ముగిశాయి. ఢిల్లీ యమునా నదీ తీరంలో ఉన్న నిగమ్ బోధ్ శ్మశాన వాటికలో జైట్లీ చితికి ఆయన కుమారుడు రోహన్ నిప్పంటించారు. ఓవైపు భారీ వర్షం కురుస్తుండగా, మరోవైపు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై జైట్లీ దహనసంస్కారాలు నిర్వహించారు. అధికార లాంఛనాల నడుమ జరిగిన జైట్లీ అంత్యక్రియలకు భారీ ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చారు. ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

జైట్లీ అంత్యక్రియల సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేకపోయారు. జైట్లీతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుని వెంకయ్య తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కాగా, జైట్లీ అంత్యక్రియలకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, పలు రాష్ట్రాల సీఎంలు, రాజకీయపక్ష నేతలు హాజరయ్యారు.
Arun Jaitly
Venkaiah Naidu

More Telugu News