Rahul Gandhi: కశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాయడం దేశద్రోహంతో సమానం: ప్రియాంక గాంధీ

  • రాహుల్ గాంధీ తదితరుల్ని శ్రీనగర్ నుంచి తిప్పిపంపడంపై ప్రియాంక మండిపాటు
  • ఇంతకంటే రాజకీయం ఉండదంటూ విమర్శలు
  • జాతీయవాదం పేరుతో కశ్మీర్ లో అణచివేతకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం
శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి రాహుల్ గాంధీ సహా విపక్ష ప్రతినిధుల బృందాన్ని వెనక్కి తిప్పి పంపడంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కశ్మీర్ లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని, ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జాతీయవాదం పేరుతో కశ్మీర్ ప్రజలను అణచివేస్తున్నారంటూ ప్రియాకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

అంతేకాకుండా, శ్రీనగర్ నుంచి విమానంలో వస్తున్న సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ కశ్మీర్ మహిళ కన్నీటి పర్యంతం అవుతూ తమ కష్టాలను వెళ్లబోసుకున్న వీడియోను కూడా ప్రియాంక ట్వీట్ చేశారు. ఇలాంటి వారు కశ్మీర్ లో లక్షల మంది ఉన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.
Rahul Gandhi
Priyanka Gandhi

More Telugu News