కశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాయడం దేశద్రోహంతో సమానం: ప్రియాంక గాంధీ
- రాహుల్ గాంధీ తదితరుల్ని శ్రీనగర్ నుంచి తిప్పిపంపడంపై ప్రియాంక మండిపాటు
- ఇంతకంటే రాజకీయం ఉండదంటూ విమర్శలు
- జాతీయవాదం పేరుతో కశ్మీర్ లో అణచివేతకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం
అంతేకాకుండా, శ్రీనగర్ నుంచి విమానంలో వస్తున్న సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ కశ్మీర్ మహిళ కన్నీటి పర్యంతం అవుతూ తమ కష్టాలను వెళ్లబోసుకున్న వీడియోను కూడా ప్రియాంక ట్వీట్ చేశారు. ఇలాంటి వారు కశ్మీర్ లో లక్షల మంది ఉన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.