ఈ-కేవైసీ నమోదుకాకుంటే రేషన్ సరుకులు ఆగిపోవు.. ప్రజలు ఆందోళన పడొద్దు!: ఏపీ పౌరసరఫరాల శాఖ కార్యదర్శి కోన శశిధర్
- ఆధార్ నమోదుకు తుది గడువు లేదు
- విద్యార్థులు ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు
- స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాల్లో ఈ-కేవైసీ ఏర్పాటు చేస్తాం
ఇక విద్యార్థులు తమ ఆధార్ అప్ డేట్ కోసం ఆధార్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాల్లోనే ఆధార్ అప్ డేట్ చేసేలా ఏర్పాట్లు చేస్తామన్నారు. ఇందుకోసం పాఠశాలలు, అంగన్ వాడీ కేంద్రాలకు ప్రభుత్వ బృందాలు వెళతాయని చెప్పారు. ఈ-కేవైసీ చేయనంత మాత్రాన రేషన్ సరుకులు తిరస్కరించబోమని స్పష్టం చేశారు. ప్రజలు ఎక్కడైతే రేషన్ సరుకులు తీసుకుంటున్నారో అక్కడే ఈ-కేవైసీని అప్ డేట్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు.