ఒక్కో విద్యార్థి రోజుకు లీటర్ నీటిని ఆదా చేయాలి: స్కూళ్లకు సీబీఎస్ఈ ఆదేశాలు
- ‘జల్‌శక్తి అభియాన్’లో భాగంగా సీబీఎస్ఈ ఉత్తర్వులు
- ఇంట్లోను, స్కూళ్లలోనూ నీటిని ఆదాచేసేలా చూడాలని ఆదేశం
- స్కూళ్లలో ఎకో క్లబ్‌లు ఏర్పాటు చేయాలని సూచన
ఎకో క్లబ్‌ల వల్ల వాతావరణ, పర్యావరణ అక్షరాస్యత పెరుగుతుందని సీబీఎస్ఈ చైర్ పర్సన్ అనితా కర్వాల్ పేర్కొన్నారు. సీబీఎస్ఈ స్కూళ్లు దీనిని ఓ ఎజెండాలా తీసుకుని అమలు చేయాలని పేర్కొన్నారు. 5-12వ తరగతి చదువుతున్న విద్యార్థులు స్కూలు, ఇంటిలో ప్రతి రోజూ ఒక లీటర్ నీటిని ఆదా చేయగలిగితే వచ్చే మూడేళ్లలో అనుబంధ పాఠశాలలు నీటి సామర్థ్య పాఠశాలలుగా మారుతాయని అనిత పేర్కొన్నారు.