Virat Kohli: కోహ్లీ చదువుతున్న బుక్... ఒక్కసారిగా పెరిగిన సేల్స్!

  • కోహ్లీ చేతిలో పుస్తకం
  • సీరియస్ గా చదువుతున్న భారత క్రికెట్ కెప్టెన్
  • నెట్టింట పేలుతున్న సెటైర్లు

ఇండియా, వెస్టిండీస్ మధ్య సర్ వివియన్ రిచర్డ్స్ స్టేడియంలో తొలి టెస్టు జరుగుతున్న వేళ, పెవీలియన్ లో కూర్చున్న కోహ్లీ ఓ పుస్తకం చదువుతూ కనిపించిన దృశ్యాలు వైరల్ కాగా, ఇప్పుడా పుస్తకం హాట్ టాపిక్ గా మారింది. డ్రెస్సింగ్ రూములో ఉన్న కోహ్లీ, చదువుతున్న పుస్తకం పేరు 'డిటాక్స్ యువర్ ఇగో: 7 ఈజీ స్టెప్స్ టు అచీవింగ్ ఫ్రీడం, హ్యాపీనెస్ అండ్ సక్సెస్ ఇన్ యువర్ లైఫ్'. దీనికి అర్థం ఏంటంటే, 'మీలోని అహాన్ని పారద్రోలండి: జీవితంలో స్వేచ్ఛ, సంతోషం, విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఏడు మార్గాలు'.

ఈ బుక్ ను కోహ్లీ సీరియస్ గా చదువుతున్నట్టు ఉండటంతో, పుస్తకానికి ప్రచారం రావడంతో పాటు కోహ్లీపై సెటైర్లూ పేలుతున్నాయి. కోహ్లీ అంటేనే అహానికి కేరాఫ్ అడ్రస్ అని, అటువంటి వ్యక్తి, ఈ పుస్తకాన్ని చదవాల్సిందేనని అంటున్నారు. కోహ్లీ చేతిలో ఆ పుస్తకం ఏంటని కూడా కొందరు అంటున్నారు.

More Telugu News