ఒకే కుటుంబంలోని ముగ్గురిని కాటేసిన కట్లపాము!
- మహబూబాబాద్ జిల్లాలో ఘటన
- పాము కాటుతో మరణించిన రవి
- చావు బతుకుల మధ్య రవి భార్య, కుమారుడు
పాము విష ప్రభావంతో జాతోట్ రవి అక్కడికక్కడే మృతి చెందగా, అతని భార్య, కుమారుడి పరిస్థితి విషమంగా ఉంది. వారికి మహబూబాబాద్ ఏరియా ఆసుపత్రిలో వైద్యులు చికిత్స చేస్తున్నారు. వీరిని కాటేసిన పాము అత్యంత విషపూరితమైందని స్నేక్ క్యాచర్లు అంటుండటం గమనార్హం.