Tollywood: ఇకపై భారీ బడ్జెట్ సినిమాలు చేయను.. హీరో ప్రభాస్ సంచలన ప్రకటన!

  • చాలా రోజులు షూటింగ్ చేయాల్సి వస్తోంది
  • అంతేకాకుండా తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నా
  • ‘సాహో’ ప్రమోషన్ లో మాట్లాడిన హీరో ప్రభాస్
టాలీవుడ్ హీరో ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా దర్శకుడు సుజిత్ తెరకెక్కించిన ‘సాహో’ సినిమా ఈ నెల 30న తెలుగు, హిందీ, తమిళం, మలయాళం భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, శ్రద్ద సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీబిజీగా గడిపేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వేడుకలో పాల్గొన్న హీరో ప్రభాస్ సంచలన ప్రకటన చేశాడు. తాను ఇకపై భారీ బడ్జెట్ చిత్రాల్లో నటించబోనని తెలిపాడు.

భారీ బడ్జెట్ చిత్రాల కారణంగా చాలా రోజులు షూటింగ్ లో పాల్గొనాల్సి వస్తుందనీ, అంతేకాకుండా సినిమా విడుదల సమయంలో తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కోవాల్సి వస్తోందని వ్యాఖ్యానించాడు. అభిమానుల కోరిక మేరకు ఇకపై ఏటా రెండు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని ప్రభాస్ వెల్లడించాడు. దాదాపు రూ.350 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్, టీ సిరీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి.
Tollywood
SAHOO
Prabhas
ACTOR
NO MORE HIGH BUDGET MOVIES
ANNOUNCED
AUGUST 30
RELEASE
SRADHA KAPOOR
SUJIT

More Telugu News