Somarapu: తెలంగాణలో జల దోపిడీ అప్పుడూ జరిగింది, ఇప్పుడూ జరుగుతోంది: సోమారపు

  • తెలంగాణ జలాలను ఏపీవాళ్లు దోపిడీ చేస్తున్నారని కేసీఆర్ అన్నారు
  • ఇప్పుడు గోదావరి నీటిని కేసీఆర్ ఎక్కడెక్కడికో తరలిస్తున్నారు
  • ఇది జల దోపిడీ కాదా?
టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఆర్టీసీ మాజీ ఛైర్మన్ సోమారపు సత్యనారాయణ తీవ్ర ఆరోపణలు చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ జలాలను ఏపీవాళ్లు దోపిడీ చేశారని కేసీఆర్ అన్నారని... ఇప్పుడు కేసీఆర్ పాలనలో కూడా అదే జరుగుతోందని మండిపడ్డారు. గోదావరి నీటిని గోదావరి పరిసర ప్రాంతాలకు ఇవ్వకుండా ఎక్కడెక్కడికో తరలిస్తున్నారని అన్నారు. అనవసరమైన రిజర్వాయర్లను నిర్మించి నీటిని తరలిస్తున్నారని తెలిపారు. ఇది జల దోపిడీ కాదా? అని ఆయన ప్రశ్నించారు.

Somarapu
KCR
Godavari Water
TRS

More Telugu News