అరుణ్ జైట్లీ మరణంతో ప్రజాజీవితంలో, మేధో వర్గంలో శూన్యం ఆవహించినట్టయింది: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్
- కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ కన్నుమూత
- ట్విట్టర్ లో స్పందించిన దేశ ప్రథమ పౌరుడు
- జైట్లీ మృతికి సంతాపం
జైట్లీ నిష్క్రమణంతో శూన్యం ఆవహించినట్టయిందని అభిప్రాయపడ్డారు. ఆయన తనకు మాత్రమే సాధ్యమైన రీతిలో ఎంతో బరువు బాధ్యతలను సైతం సమతూకంతో, అత్యంత అనురక్తితో, పరిపూర్ణ అవగాహనతో నిర్వర్తించారని ఈ సందర్భంగా భారత రాష్ట్రపతి కొనియాడారు.