Tirupati: దేశ హితం కోరేవారు బీజేపీలోకి...స్వార్థపరులు వైసీపీలోకి: రాంమాధవ్‌

  • గత రెండు నెలల్లో చాలా మంది బీజేపీలో చేరారు
  • త్వరలో ఆంధ్రాలోనూ పాగా వేస్తాం
  • ఇప్పటికే ప్రజలు అధికార పార్టీ పనితీరును అంచనా వేసుకుంటున్నారు
దేశహితాన్ని కోరుకునే వారు భారతీయ జనతా పార్టీలో చేరుతారని, తాత్కాలిక ప్రయోజనాలు, స్వార్థం కోరుకునే వారు అధికార వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరుతారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ అన్నారు. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఆయన సమక్షంలో టీడీపీ సీనియర్‌ నేత సైకం జనార్దన్‌రెడ్డి కమల దళంలో చేరారు.

ఈ సందర్భంగా తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో రాంమాధవ్ మాట్లాడుతూ గడచిన రెండు నెలల్లో చాలామంది ప్రముఖులు బీజేపీలో చేరారని, రెండో సారి అధికారంలోకి వచ్చాక ప్రధాని మోదీ పాలనలో చూపిన సత్తాయే ఇందుకు కారణమన్నారు.  ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం పనితీరును ప్రజలు బేరీజు వేసుకుంటున్నారని, వారు వాస్తవాలు తెలుసుకునే రోజున బీజేపీని వెన్నంటి నడుస్తారని జోస్యం చెప్పారు. ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా పాల్గొన్నారు.
Tirupati
rammadhav
BJP
Telugudesam
YSRCP

More Telugu News